⚠️

ఎలా చేయకూడదు?

బైబిల్ స్టడీ  ›  ఎలా చేయకూడదు?

బైబిలు అధ్యయనము ఎలా చేయకూడదు? తప్పు పద్ధతులు మరియు అపోహలను తెలుసుకొని, సరైన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి.

▶️ వీడియో చూడండి

Watch Video

యూట్యూబ్ లో చూడండి →

Source: Know Your Bible (KYB)

బైబిలు అధ్యయనము ఎలా చేయకూడదు?

20 తప్పు పద్ధతులు — వీటిని నివారించండి

  1. 1

    కధల పుస్తకముగా చదువకూడదు.

  2. 2

    కేవలము ఆధ్యాత్మిక సంధర్భముల కోసమే అన్నట్లుగా చదువకూడదు.

  3. 3

    తప్పులు పట్టుకోవటానికి అన్నట్లుగా చదువకూడదు.

  4. 4

    కేవలము చదివి వదిలేసే విధముగా చదువకూడదు.

  5. 5

    ఎదుటివారిని విమర్శించుటకు చదువకూడదు (అన్యులు అయినా, ఇతర క్రైస్తవులు అయినా).

  6. 6

    సందర్భమును విడిచిపెట్టి చదువకూడదు.

  7. 7

    ఆ కాలము యొక్క జీవనపద్దతులు, ఆచారములు మరచిపోయి వ్యక్తులు చేసిన పనులను అపార్థము చేసికోకూడదు.

  8. 8

    ఒక పద్ధతి లేకుండా ఇష్టము వచ్చిన చోట వచనము తీసుకొని చదువకూడదు.

  9. 9

    ఇతర మత గ్రంధములతో పోల్చి చదువకూడదు.

  10. 10

    కేవలము విజ్ఞానము సంపాదించుకోవటానికి చదువకూడదు.

  11. 11

    వచనములో మనకు నచ్చిన భాగము తీసుకొని, మిగతా భాగము వదిలేయకూడదు. వచనమును దాని సంపూర్ణతలో చూడాలి.

  12. 12

    మన ప్రవర్తన సమర్థించుకోవటానికి కారణములు వెతుకుటకు చదువకూడదు.

  13. 13

    కేవలము లాభము ఆశించి, స్వార్థము కోసము చదువకూడదు.

  14. 14

    చరిత్ర గురించి తెలిపే పుస్తకముగా చదువకూడదు.

  15. 15

    ఎవరికీ తెలియని ప్రత్యక్షతలు తెలుసుకోవాలి అని చదువకూడదు.

  16. 16

    క్రొత్త నిబంధన మాత్రమే ప్రాముఖ్యమైనది, పాత నిబంధన కాదు అనే అభిప్రాయముతో చదువకూడదు.

  17. 17

    బైబిలు పరిధి దాటి ఆలోచన, నిర్ధారణలు చేయకూడదు.

  18. 18

    బైబిలు మీద వ్రాయబడిన పుస్తకములు, ఇతర పుస్తకములలోని అంశములు బైబిలును దృవీకరించుటకు ప్రామాణికముగా తీసుకోకూడదు.

  19. 19

    మనము నేర్చుకున్న విషయములు బైబిలులోని మిగతా విషయములతో విభేదించకూడదు.

  20. 20

    పూర్తిగా కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా అధ్యయనము చేయటము మంచిది కాదు. ఏకాగ్రత దెబ్బతినే అవకాశము ఉన్నది. బైబిలు, నోట్ బుక్ ద్వారా ప్రారంభించాలి.

ఎందుకు చదవరు? తదుపరి: ఎలా సిద్ధపడాలి?