బైబిలు అధ్యయనమునకు ఎలా సిద్ధపడాలి? హృదయాన్ని, మనస్సును మరియు వాతావరణాన్ని సిద్ధపరుచుకొని దేవుని వాక్యమును లోతుగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి.
బైబిలు అధ్యయనమునకు ఎలా సిద్ధపడాలి?
27 ముఖ్యమైన సూచనలు — మెరుగైన అధ్యయనం కోసం
-
1
దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము కలిగియుండాలి.
-
2
తమ జీవితమనకు దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించగలిగి యుండాలి.
-
3
తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటే చాలా మంచిది. బైబిలును చదువుటకు అవసరము లేదు కాని అధ్యయనము చేయుటకు ఈ అనుభవము చాలా ఉపకరిస్తుంది.
-
4
దేవుని వాక్యము పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
-
5
కష్టపడి సమయము వెచ్చించి నేర్చుకోవటానికి సుముఖత కలిగి ఉండాలి.
-
6
దేవుని మాటకు సంపూర్ణముగా లోబడే మనస్సు/గుణము కలిగి ఉండాలి.
-
7
చిన్నపిల్లల వంటి హృదయము ఉండాలి.
-
8
వాక్యము దేవుని యొక్క మాటగా పరిగణించాలి. మనుష్యుల చేత వ్రాయబడినదిగా చూడకూడదు.
-
9
ప్రార్థనా పూర్వకముగా చదవాలి, సిద్ధపడాలి.
-
10
ప్రతిరోజూ క్రమము తప్పకుండా చేయటానికి ప్రయత్నము చేయండి.
-
11
పూర్తి ఏకాగ్రతతో చేయాలి, చదవాలి.
-
12
ప్రతిసారి చదువబడిన వాక్యములో దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి చూడటానికి ప్రయత్నము చేయండి.
-
13
చదివిన వచనములను గుర్తు పెట్టుకోవటానికి లేదా కంటస్థము చేయటానికి ప్రయత్నము చేయండి.
-
14
సమయమును సద్వినియోగము చేసుకోవటానికి ప్రయత్నము చేయండి.
-
15
మ్రొక్కుబడిగా, హడావుడిగా చేయకండి. ఏదైనా ఒకరోజు కుదురకపోతే విరామము ఇవ్వండి.
-
16
పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు అడగండి.
-
17
మార్పు అనేది కష్టము. సాతాను మనతో ఎప్పుడూ ఎదురు పోరాడుతూనే ఉంటాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించాలి.
-
18
మీలో మార్పుకోసము తగిన సమయము తీసుకొని హడావుడి లేకుండా మీ సామర్థ్యము కొలది సాధ్యమయ్యే విధముగా ప్రణాళిక సిద్ధము చేసుకొనండి.
-
19
బైబిలు గురించి సరైన అవగాహన కలిగిన వారిని నాయకుడిగా పెట్టుకొనండి.
-
20
మీరు నేర్చుకునే అంశములు బైబిలు పరిధిదాటి లేకుండా చూసుకొనండి.
-
21
మొదటిరోజునే మనకు సమస్తము అర్థము కావు అని గుర్తెరిగి వాక్యము అర్థము అవటానికి, అవగాహన రావటానికి తగిన సమయము తీసుకొనండి.
-
22
మొదటిగా మీరు చేయవలసిన స్టడీ చేయండి. మీ ఆలోచనలు, దేవుడు మీతో మాట్లాడిన అంశములు వ్రాయండి. తరువాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కామెంటరీలు చదవండి.
-
23
పరిశుద్ధ గ్రంథము జీవితము మార్చటానికి కాని మనము క్రొత్త సిద్ధాంతములు చేయటానికి కాదు అని గుర్తెరిగి వాక్యము మీ జీవితము గురించి ఏమి చెప్తున్నది అనే కోణములో చూడండి.
-
24
మీరు వ్రాసుకున్న నోట్స్ మీరు కొన్ని దినములు లేదా సంవత్సరముల తరువాత చూస్తే మరలా దేవునిలో ప్రోత్సహించబడేలా వ్రాసుకొనండి.
-
25
మీరు ఎంత కష్టపడ్డారు అని కాకుండా దేవుడు మీ నిమిత్తము ఏమి చేసియున్నారు అనేది హైలైట్ చెయ్యండి.
-
26
మీరు వ్రాసుకున్న నోట్స్ మీ తరువాతి తరములను ప్రోత్సహించే విధముగా ఉండాలి. మీ పిల్లలు మీ అనుభవములను చాలా సీరియస్ గా తీసుకుంటారు అని గుర్తించండి.
-
27
మీరు వ్రాసుకున్న నోట్స్ కంప్యూటర్ లో టైపు చేసి భద్రము చేయండి.