🔎

Inductive Bible Study

బైబిల్ స్టడీ  ›  అధ్యయన పద్దతులు  ›  Inductive Bible Study

"పరిశుద్ద గ్రంధమును పరిశీలించి (Observation), అర్ధం చేసుకొని (Interpretation), జీవితమునకు అన్వయించుకొనుటకు (Application) ఉపయోగపడు సమగ్రమైన OIA పద్ధతి."

▶️

వీడియో చూడండి

Watch Video
యూట్యూబ్ లో చూడండి →

Inductive Bible Study — OIA పద్ధతి

🔍
O
పరిశీలన
Observation
💡
I
వివరణ
Interpretation
🎯
A
అన్వయింపు
Application
🔍

పరిశీలన (Observation)

పరిశుద్ద గ్రంధము ఏమి చెప్తుంది? — ఆ వచనమును జాగ్రత్తగా, పదే పదే చదివి గమనించండి.

  • ఎవరు (Who)? — ఈ సంఘటనలో ఎవరు పాల్గొన్నారు?
  • ఏమి (What)? — ఏమి జరిగింది? ఏమి చెప్పబడింది?
  • ఎక్కడ (Where)? — ఎక్కడ జరిగింది?
  • ఎప్పుడు (When)? — ఏ సమయంలో జరిగింది?
  • ఎందుకు (Why)? — ఎందుకు జరిగింది?
  • ఎలా (How)? — ఎలా జరిగింది?
  • ముఖ్య పదాలు, పదబంధాలు, సంఘటనలు గుర్తించండి.
  • పునరావృతమయ్యే పదాలు, అంశాలు గమనించండి.
  • వ్యత్యాసాలు, పోలికలు, కారణ-ఫలితాలు గుర్తించండి.
  • వచనముల అమరిక, నిర్మాణం (structure) అర్థం చేసుకొనండి.
💡

వివరణ (Interpretation)

పరిశుద్ద గ్రంధము ఏమి అర్థం? — ఆ వచనం యొక్క అసలు అర్థం ఏమిటో గుర్తించండి.

  • రచయిత యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
  • మొదటి పాఠకులకు ఈ వచనం ఏమి అర్థమైంది?
  • సందర్భం (context) ఏమిటి — చుట్టూ ఉన్న వచనాలు ఏమి చెప్తున్నాయి?
  • పరిశుద్ద గ్రంధంలోని ఇతర వచనాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయి?
  • ముఖ్య పదాల మూల అర్థం (హీబ్రూ/గ్రీకు) తెలుసుకోండి.
  • చారిత్రక, సాంస్కృతిక నేపధ్యం (background) అర్థం చేసుకోండి.
  • ఈ వచనం నుండి ఒక కేంద్రీయ సత్యం (main truth) గుర్తించండి.
  • సరళమైన, స్పష్టమైన అర్థమే సొంత అర్థముకంటే ముఖ్యమైనది.
🎯

అన్వయింపు (Application)

పరిశుద్ద గ్రంధం నేను ఎలా జీవించాలని చెప్తుంది? — ఆ సత్యాన్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అర్థం చేసుకోండి.

  • ఈ వచనం ఈ రోజు నా జీవితంలో ఏమి అర్థం?
  • మార్చుకోవలసిన ఆలోచన, వైఖరి లేదా చర్య ఏమైనా ఉందా?
  • పాటించవలసిన ఆజ్ఞ ఏమైనా ఉందా?
  • దేవుని నుండి ఏదైనా వాగ్దానం పట్టుకోవలసినది ఉందా?
  • అనుకరించదగిన మాదిరి ఉందా?
  • నివారించవలసిన తప్పు లేదా హెచ్చరిక ఉందా?
  • దేవుని గురించి కొత్తగా నేర్చుకున్నది ఏమిటి?
  • నిర్దిష్టంగా ఈ వారంలో నేను చేయబోతున్న ఒక మార్పు ఏమిటి?
క్రితం: వచనముల స్టడీ అన్ని పద్దతులు