"బైబిలులోని ఒక వచనమును లేదా కొన్ని వచనములను లోతుగా అధ్యయనము చేసి వాటిలోని సత్యమును అర్థం చేసుకొని జీవితమునకు అన్వయించుకొనుటకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది."
వచనముల వారీగా స్టడీ విధానము
-
1
📖
మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న వచనములు ఎంచుకొనండి.
-
2
🔢
3-5 వచనములకు మించకుండా చూసుకొనండి. ఒకవేళ ఒక వచనములో ధ్యానించుటకు ఎక్కువ సమాచారము ఉన్న యెడల ఒక్క వచనము అయినా చాలు.
-
3
📚
మీరు ఎంచుకున్న వచనముల యొక్క అధ్యాయము గురించి మీకు కనీస అవగాహన ఉంటే మంచిది.
-
4
👁️
5-10 సార్లు ఆ వచనములను చదవండి.
-
5
✏️
వచనములలో ప్రస్తావించబడిన విషయము వ్రాయండి.
-
6
🔗
వచనములు అధ్యాయము యొక్క సందర్భమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి.
-
7
🎯
వచనములు అధ్యాయము యొక్క ఉద్దేశ్యమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి.
-
8
🔀
ప్రతి వచనమునకు క్రాస్ రిఫరెన్స్ వెతికి వాటిని కూడా స్టడీ చెయ్యండి.
-
9
🌄
మీకు ఉన్న జ్ఞానమును బట్టి ఆ వచనములలోని దృశ్యమును ఊహించటానికి ప్రయత్నము చేయండి.
-
10
🔤
వచనములలో ఉపయోగించబడిన ప్రధాన పదములు గుర్తించండి.
-
11
🗣️
ఆ వాక్యములోని పదములను ఒక్కోసారి ఒక్కోటి నొక్కిపట్టి చదవండి. ఆ పదము మీతో ఏమైనా మాట్లాడితే వ్రాసుకొనండి.
-
12
📝
ఆ వచనముల యొక్క సారాంశము క్లుప్తముగా మీ స్వంత పదములతో వ్రాయండి.
-
13
🔭
అన్ని కోణములలోను ఆ సంఘటనను విశ్లేషించండి — వ్యక్తుల వైపు నుంచి, 3వ వ్యక్తిగా, దేవుని కోణము నుంచి.
-
14
💡
మీరు స్టడీ చేసిన తరువాత గ్రహించిన అంశములను విపులముగా వ్రాయండి. క్లుప్తముగా వ్రాయవద్దు.
-
15
🪞
మీరు గ్రహించిన అంశములను మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో చూడండి.
-
16
📅
వాటి నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి.
-
17
⏰
వచనములలో కాలము గురించి ఏమైనా చెప్పబడినదా?
-
18
⚖️
వచనములలో ఏవైనా పోల్చి చెప్పటము జరిగినదా?
-
19
👤
వచనములలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఎవరు?
-
20
🏷️
వారి పేరులకు గల అర్ధము ఏమిటి?
-
21
💭
ఆ వ్యక్తులు ఎలాంటివారు?
-
22
💬
ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాటలు ఎవరైనా 3వ వ్యక్తి గురించి చెప్పబడినవా?
-
23
📅
ఈ వచనములలో ఉన్న విషయములు ఏ కాలములో జరిగాయి?
-
24
🗺️
ఈ వచనములలో ఉన్న విషయములు ఎక్కడ జరిగాయి?
-
25
📍
ఆ ప్రదేశము యొక్క పేరు ఇప్పుడు ఏమిటి? అది ఎక్కడ ఉన్నది? పేరునకు అర్ధము ఏమిటి? పరిశుద్ద గ్రంధములో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా?
-
26
🧩
ఈ వచనములలో ఉన్న విషయములు జరగటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఆ పరిస్థితులు దేవుని చిత్తము వలన కలిగినవా? మనుష్యుల వలన వచ్చినవా?
-
27
🔮
ప్రవచనము ఏదైనా ఉంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది?
వచనములను స్టడీ చేస్తున్నపుడు ఈ క్రింది విషయములు గమనించండి
పాపము
ఒప్పుకుని విడిచిపెట్టవలసిన పాపము ఏమైనా ఉన్నదా?
- ✦ ఆ పాపము నుండి విడుదల ఎలా పొందాలి?
- ✦ ఆ పాపము వలన ఎవరిని అయినా నొప్పించారా? అయితే క్షమాపణ అడగండి.
- ✦ ఆ పాపము వలన ఎవరికి అయినా నష్టము కలిగించారా? అయితే దానిని ఎలా భర్తీ చేస్తారు?
- ✦ ఆ పాపమునకు దేవుని దగ్గర నుండి ఎలా పరిహారము, క్షమాపణ పొందాలి?
వాగ్దానము
ఏదైనా వాగ్ధానము ఉన్నదా?
- ✦ అది షరతులతో కూడిన వాగ్దానమా? షరతులు లేనిదా?
- ✦ ఆ షరతులు మీరు కలిగి ఉన్నారా?
- ✦ ఈ వాగ్ధానము ఏ సందర్భములో ఉపయోగించుకొనవచ్చు?
- ✦ ఈ వాగ్ధానము ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ప్రజలకు ఇవ్వబడినదా?
- ✦ వాగ్ధానము విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
వ్యక్తిత్వ మార్పు
వ్యక్తిత్వము పరముగా మార్చుకొనవలసినది ఏమైనా ఉన్నదా?
- ✦ అది మంచి లక్షణము అయితే అది మీలో ఎదిగేలా ఏమి చెయ్యాలి?
- ✦ అది చెడ్డ లక్షణము అయితే మీలో నుంచి పోయేలా ఏమి చెయ్యాలి?
ఆజ్ఞ
పాటించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా?
- ✦ మీకు నష్టము కలిగినా పాటించటానికి సిద్దమనస్సు కలిగి ఉన్నారా?
- ✦ లాభసాటిగా ఉన్నంతవరకే పాటిస్తారా?
- ✦ మీ మనస్సునకు నచ్చితేనే పాటిస్తారా?
- ✦ దేవుడు చెప్పాడు కాబట్టి ఎలా అయినా సరే పాటిస్తారా?
హెచ్చరికలు & జాగ్రత్తలు
హెచ్చరికలు, శాపములు ఏమైనా ఉన్నాయా?
- ✦ మీరు అనుకరించదగిన మాదిరి ఏమైనా ఉన్నదా?
- ✦ జాగ్రత్త పడవలసిన విషయములు ఏమైనా ఉన్నాయా?
- ✦ ఆ తప్పులలో పడిపోకుండా ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి?
- ✦ విశ్వసించవలసినది ఏమైనా ఉన్నదా?
దేవుని గురించి
దేవుని గురించి తెలిసికొనుటకు ఏదైనా విషయము కలదా?
- ✦ తండ్రి గురించి
- ✦ కుమారుడైన క్రీస్తు గురించి
- ✦ పరిశుద్దాత్మ దేవుని గురించి
- ✦ దేవదూతల గురించి ఏమైనా విషయములు చెప్పబడినవా?
- ✦ సాతాను, వాడి దూతల గురించి ఏమైనా చెప్పబడినదా?
- ✦ దేవుని శతృవులు గురించి ఏమైనా విషయములు కలవా?
- ✦ భక్తిహీనులు, దుర్మార్గుల గురించి ఏమైనా విషయము ఉన్నదా?
- ✦ పరిశుద్ద గ్రంధము నందలి ఏదైనా వేరే విషయము తెలిసికొనుటకు ఈ వచనములు ఉపకరిస్తాయా?
స్తుతి & ప్రార్ధన
దేవునికి ప్రార్ధన చేయుటకు, స్తుతించుటకు అంశములు ఏమైనా ఉన్నాయా?
- ✦ దేవుని స్తుతించుటకు ఏమైనా అంశములు కలవా?
- ✦ దేవుని ఆరాదించుటకు ఏమైనా అంశములు కలవా?
- ✦ దేవునికి కృతజ్ఞత కలిగిఉండేలా ఏమైనా అంశములు కలవా?