"బైబిలులోని ఒక అధ్యాయమును పరిశుద్ద గ్రంధపు సందర్భముతో మరియు అందులోని ప్రతి అంశమును లోతుగా అధ్యయనము చేయుటకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది."
అధ్యాయముల వారీగా స్టడీ విధానము
-
1
📄
మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న అధ్యాయము ఎంచుకొనండి.
-
2
📚
మీరు స్టడీ చేయబోతున్న అధ్యాయము ఏ పుస్తకములోనిదో దాని యొక్క అమరిక మీకు ఒక అవగాహన ఉండాలి. అప్పుడే అధ్యాయము యొక్క సందర్భము మీకు సరిగా అర్ధము అవుతుంది. లేకపోతే సందర్భము విడిచి అపార్ధము చేసుకునే ప్రమాదము కలదు.
-
3
👁️
ఆ అధ్యాయమును కనీసము 5 సార్లు అయినా చదవండి.
-
4
🏷️
అధ్యాయములో ప్రస్తావించబడిన విషయములను బట్టి దానికి ఒక చిన్న హెడ్డింగ్ ఇవ్వండి.
-
5
📝
అధ్యాయము యొక్క సారాంశమును 2-3 లైన్లలో క్లుప్తముగా వ్రాయండి.
-
6
🔑
అధ్యాయము నందు ప్రాముఖ్యముగా ప్రస్తావించిన విషయములు ఏమిటి?
-
7
👤
అధ్యాయము నందు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?
-
8
⭐
అధ్యాయములో ముఖ్యమైన వచనము ఏమిటి?
-
9
🔤
అధ్యాయము నందు ఉపయోగించబడిన ప్రాముఖ్యమైన పదములు ఏమిటి?
-
10
🔗
ఈ అధ్యాయము గురించి మరింత సమాచారము ఇవ్వగలిగిన అధ్యాయములు పరిశుద్ద గ్రంధములో ఇంకా ఏమైనా ఉన్నాయా?
-
11
❓
అధ్యాయము నందు సంధించబడిన ప్రశ్నలు ఏమిటి?
-
12
✅
వాటికి సమాధానములు అధ్యాయములో ఇవ్వబడినాయా?
-
13
📜
అధ్యాయములో దేవుని ఆజ్ఞలు.
-
14
🌟
అధ్యాయములో దేవుని దీవెనలు.
-
15
🤝
అధ్యాయములో దేవుని వాగ్దానములు.
-
16
⚡
అధ్యాయములో దేవుని శాపములు.
-
17
⚠️
అధ్యాయములో హెచ్చరికలు/జాగ్రత్తలు.
-
18
🪞
అధ్యాయములో ఉపయోగించబడిన పోలికలు.
-
19
💬
అధ్యాయములో ఉపమానములు.
-
20
📖
అధ్యాయములో ఉదాహరణలు.
-
21
💪
అధ్యాయములో ప్రోత్సహించిన విషయములు.
-
22
🏺
అధ్యాయములో ప్రస్తావించబడిన వస్తువులు.
-
23
😲
అధ్యాయములో ఆశ్చర్యము కలిగించే విషయములు.
-
24
🔮
అధ్యాయములో వింత/విచిత్రమైన విషయములు.
-
25
⚖️
అధ్యాయములో పరస్పర విరుద్దమైన విషయములు ఏమైనా ఉన్నాయా?
-
26
🚫
అధ్యాయములో పాపము గురించి, దాని పర్యవసానముల గురించి ఏమైనా చెప్పబడినదా?
-
27
🙌
అధ్యాయములో విధేయత గురించి, దాని వలన కలుగు దీవెనల గురించి ఏమైనా వ్రాయబడినదా?
-
28
🤔
ఈ అధ్యాయము చదివినపుడు అర్ధము చేసుకోవటానికి మీకు కష్టముగా అనిపించిన వచనములు, భాగములు వ్రాయండి.
-
29
🏘️
అధ్యాయములోని వ్యక్తుల జీవన పరిస్థితి.
-
30
🧠
అధ్యాయములోని వ్యక్తుల మానసిక పరిస్థితి.
-
31
🔄
క్రొత్త నిబంధన అధ్యాయము అయితే పాత నిబంధనతో ఏమైనా సంబంధము కలిగి ఉన్నదా?
-
32
🔁
పాత నిబంధన అధ్యాయము అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడ అయినా ప్రస్తావించబడినదా?
-
33
🌍
అధ్యాయములోని విషయములను ఈ కాలమునకు ఎలా అన్వయించాలి?
-
34
🕳️
అధ్యాయము పుస్తకములో లేకపోతే కలిగే లోటు ఏమిటి?
-
35
✍️
అధ్యాయము ద్వారా ఏమి తెలుసుకోవాలి అని రచయిత యొక్క ఉద్దేశ్యము?
-
36
🗂️
అధ్యాయము వెనుక దాగియున్న సందర్భము ఏమిటి?
-
37
📊
అధ్యాయములోని విషయములను వర్గీకరించండి (విషయము, ఏ వచనములో మొదలైనది, ఏ వచనములో ముగించబడినది).
-
38
💡
అధ్యాయము స్టడీ చేయటము ద్వారా మీరు గ్రహించిన విషయములు వ్రాయండి.
-
39
🪞
వాటిని మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో గమనించండి.
-
40
📅
వాటి నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి.
-
41
🌊
అధ్యాయములో చెప్పబడిన అంశములు ఆ ప్రజల మీద ఎలాంటి ప్రభావము చూపించాయి?
-
42
🖼️
అధ్యాయములోని విషయమును చిత్రరూపకముగా చూపించుటకు ప్రయత్నము చేయండి.