"పరిశుద్ద గ్రంధములో పేర్కొనబడిన వ్యక్తుల జీవితాన్ని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా దేవుని సత్యాలను, మన జీవితానికి అన్వయించుకొనదగిన పాఠాలను నేర్చుకోవచ్చు."
వ్యక్తుల జీవితచరిత్ర స్టడీ విధానము
-
1
✏️
మీరు ఎవరి జీవితము గురించి స్టడీ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు వ్రాయండి.
-
2
👥
బైబిలులోని స్త్రీ, పురుషుల పేర్లు మీ జాబితాలో ఉండేలా చూడండి. దేవునికి ఇద్దరి మధ్యన బేధము లేదు కాబట్టి ఇద్దరి జీవితముల నుంచి మనము నేర్చుకొనవచ్చు.
-
3
🏆
పరిశుద్ద గ్రంధములో విజయము కలిగినవారు, వైఫల్యము చెందినవారి ఇద్దరి జాబితా నుండి మీ పేర్లు ఉండేలా చూడండి.
-
4
🙏
ఆ వ్యక్తి గురించి సరైన దృక్పదముతో అర్ధము చేసికొనగలిగేలా ప్రార్ధన చెయ్యండి.
-
5
📋
ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి వచనమును పరిశుద్ద గ్రంధము నుండి సేకరించండి.
-
6
📝
ఆ వ్యక్తి గురించి మీరు కలిగియున్న ప్రాధమిక సమాచారము, అభిప్రాయము వ్రాయండి.
-
7
🗓️
ఆ వ్యక్తి జీవితములో జరిగిన సంఘటనలను పుట్టుక నుంచి మరణము వరకు వరుస క్రమములో అమర్చండి.
-
8
🔍
ఆ వ్యక్తి గురించి మీరు సేకరించిన వచనములను స్టడీ చెయ్యండి.
-
9
⭐
ఆ వ్యక్తి యొక్క లక్షణములను గురించి అధ్యయనము చేయండి.
-
10
💡
ఆ వ్యక్తి తన జీవితము ద్వారా తెలియజేసిన బైబిలు సత్యములను గుర్తించండి.
-
11
📄
స్టడీ చేసిన తరువాత ఆ వ్యక్తి గురించి మీకు కలిగిన అభిప్రాయము, తెలుసుకున్న విషయములు వ్రాయండి.
-
12
🔄
ఆ వ్యక్తి గురించి ఏమైనా అపార్ధములు కలిగి ఉన్నారేమో గమనించండి. ఆ అపార్ధము ఎందుకు వచ్చినదో విశ్లేషించండి.
-
13
❤️
ఇదే విధముగా మీ జీవితములో ఎవరిని అయినా అపార్ధము చేసుకున్నారేమో, సంబంధ బాంధవ్యములు దెబ్బతిన్నాయేమో ఆలోచించండి.
-
14
🕊️
వాటిని దేవుని సహాయముతో ఎలా సరిచేసుకోవాలో ప్రార్ధనా పూర్వకముగా ఆలోచించండి.
-
15
🪞
ఆ వ్యక్తి జీవితమును, మీ జీవితముతో పోల్చుకుని చూడండి.
-
16
🎯
మీరు సరిచేసుకొనవలసిన అంశములు గుర్తించండి.
-
17
📅
ఆ అంశముల నిమిత్తము ప్రణాళిక సిద్దము చేయండి.
-
18
🙌
మీరు కలిగియున్న మంచి లక్షణముల విషయమై దేవునికి, అందుకు కారణమైన వ్యక్తులకు కృతజ్ఞత చెల్లించండి.
-
19
🔎
వ్యక్తి యొక్క జీవితమును స్టడీ చేస్తున్నపుడు ఈ క్రింది విషయములను గమనించండి.
🪞 మీ జీవితముతో పోల్చుకుని ఆలోచించండి
- › ఈ వ్యక్తి జీవితము నా జీవితమును ఎంతవరకు ప్రతిబింబిస్తుంది?
- › ఈ వ్యక్తి జీవితములో ఉన్న మంచి లక్షణములు నాలో ఏవైనా ఉన్నాయా?
- › ఈ వ్యక్తి జీవితములో ఉన్న చెడ్డ లక్షణములు నాలో ఏమైనా ఉన్నాయా?
- › ఈ వ్యక్తి జీవితములో మిమ్ములను ఎక్కువగా ప్రభావితము చేసిన అంశములు ఏమిటి?
- › ఈ వ్యక్తి జీవితము చూసినపుడు మీరు ఏ విషయములలో తగిన స్థాయిలో లేరు?
- › మీరు సరిచేసుకొనవలసిన అంశములు గుర్తించండి.
- › ఆ అంశముల నిమిత్తము ప్రణాళిక సిద్దము చేయండి.
- › మీరు కలిగియున్న మంచి లక్షణముల విషయమై దేవునికి, అందుకు కారణమైన వ్యక్తులకు కృతజ్ఞత చెల్లించండి.
🔎 వ్యక్తి యొక్క నేపథ్యము
- ✦ ఈ వ్యక్తి యొక్క కుటుంబము, వంశము గురించి ఏమి తెలుసు?
- ✦ వ్యక్తి పేరునకు ఉన్న అర్ధము ఏమిటి?
- ✦ ఆ పేరు ఎందు నిమిత్తము పెట్టబడినది?
- ✦ ఆ పేరు ఎప్పుడైనా మార్చబడినదా?
- ✦ వ్యక్తి కుటుంబము ఎలాంటిది?
- ✦ వ్యక్తి ఎలా పెంచబడ్డాడు?
- ✦ వ్యక్తి ఎలాంటి లక్షణములతో పెరిగాడు?
- ✦ వ్యక్తి తల్లితండ్రులు ఎలాంటివారు?
- ✦ తల్లి తండ్రి యొక్క ప్రభావము వ్యక్తి మీద ఎంతవరకు ఉన్నది?
- ✦ వ్యక్తి పుట్టుకలో ఏదైనా విశేషమున్నదా?
- ✦ వ్యక్తి ఎక్కడ జీవించాడు?
- ✦ అతని అనుదిన జీవితము ఎలా ఉండేది?
- ✦ వ్యక్తి ఇతర సంస్కృతులలో ఎప్పుడైనా జీవించాడా?
- ✦ వాటి యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నదా?
- ✦ వ్యక్తి జీవిత సమయములో వారు జీవిస్తున్న దేశము యొక్క రాజకీయ పరిస్థితులు ఏమిటి?
- ✦ వ్యక్తి జీవిత సమయములో వారు జీవిస్తున్న దేశము యొక్క ఆత్మీయ పరిస్థితి ఏమిటి?
- ✦ వ్యక్తి చదువుకున్నవాడా?
- ✦ వ్యక్తి ఎవరి ద్వారా అయినా ప్రత్యేకమైన తర్ఫీదు పొందుకున్నాడా?
- ✦ వ్యక్తి యొక్క వృత్తి ఏమిటి?
- ✦ వ్యక్తి యొక్క వృత్తికి, దేశము యొక్క సంస్కృతికి, ఆచారములకు ఏమైనా సంబంధము ఉన్నదా?
- ✦ వ్యక్తి ఎన్ని సంవత్సరములు జీవించాడు?
- ✦ వ్యక్తి ఎక్కడ మరణించాడు?
- ✦ ఆ ప్రదేశములో మరణించటానికి ఏదైనా ప్రత్యేక కారణము ఉన్నదా?
- ✦ వ్యక్తి ఎలా మరణించాడు?
- ✦ వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో ఏ రచయితలు వ్రాసారు?
- ✦ రచయితకు వ్యక్తికి ఏమైనా సంబంధము ఉన్నదా?
- ✦ వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో వ్రాయబడిన పుస్తకముల పేర్లు ఏమిటి?
🔎 ఇతరుల అభిప్రాయములు
- ✦ వ్యక్తి గురించి ఆ కాలపు ప్రజలు ఎలాంటి అభిప్రాయము కలిగియున్నారు?
- ✦ వ్యక్తి గురించి అతని స్నేహితులు ఎలాంటి అభిప్రాయము కలిగియున్నారు?
- ✦ వ్యక్తి గురించి అతని శతృవులు కలిగియున్న అభిప్రాయము ఏమిటి?
- ✦ వ్యక్తి గురించి అతని కుటుంబసభ్యులు కలిగియున్న అభిప్రాయము ఏమిటి?
- ✦ దేవుడు ఎందునిమిత్తము ఈ వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో వ్రాయించారు?
🔎 వ్యక్తి యొక్క ప్రవర్తన & స్పందన
- ✦ వ్యక్తి యొక్క లక్ష్యములు ఏమిటి?
- ✦ వ్యక్తి ఇంటిలో ఎలా ప్రవర్తించేవాడు?
- ✦ అపజయము కలిగినపుడు వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఎలా ఉండేది?
- ✦ సులభముగా కృంగిపోయే మనస్తత్వము కలిగినవాడా?
- ✦ నిందలకు అతని స్పందన ఎలా ఉండేది?
- ✦ నిందలను సమర్ధవంతముగా ఎదుర్కొనగలిగిన సామర్ధ్యము ఉన్నదా?
- ✦ విజయము కలిగినపుడు వ్యక్తి యొక్క స్పందన ఎలా ఉండేది?
- ✦ దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్తత్వము కలిగినవాడా?
- ✦ ఎవరైనా పొగిడితే గర్వించే హృదయము కలిగినవాడా?
- ✦ అల్పమైన, చిన్న విషయముల యందు అతని ప్రవర్తన ఎలా ఉండేది?
- ✦ చిన్న విషయములలో నమ్మకత్వము కలిగియున్నాడా?
- ✦ లోక సంబంధమైన విషయములలో వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండేది?
- ✦ అతనికి జరిగిన మేలుల విషయమై దేవుని స్తుతించే మనస్సు ఉన్నదా? అది ఎంత త్వరగా అమలుచేసేవాడు?
- ✦ అతనికి కలిగిన చెడు విషయముల యందు దేవుని దూషించే లక్షణము ఉన్నదా?
- ✦ అతనికి కలిగిన చెడు విషయముల యందు దేవుని స్తుతించే గుణము ఉన్నదా?
- ✦ దేవుడు ఏదైనా చేయమని చెబితే ఎంత సమయములో చేసేవాడు?
- ✦ దేవుని వలన ఏర్పరచబడిన అధికారులకు, అధికారమునకు లోబడే గుణము ఉన్నదా?
- ✦ దేవునితో ఏకాంతముగా ఉన్నప్పుడు వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేది?
- ✦ అతని జీవితములో పెనుసవాళ్లు ఏమైనా ఎదురయ్యాయా?
- ✦ వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు?
🔎 వ్యక్తి & దేవుని సంబంధము
- ✦ వ్యక్తి జీవితము మీద దేవుని పిలుపు ఉన్నదా?
- ✦ దానికి అతను ఎలా ప్రతిస్పందించాడు?
- ✦ దేవుని సార్వభౌమాధికారమునకు అతను లోబడ్డాడా?
- ✦ దేవునికి, వ్యక్తికి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి?
- ✦ వ్యక్తి దేవుని పట్ల దాసుని స్వభావము కలిగియున్నాడా?
- ✦ వ్యక్తి పరిశుద్దాత్మ చేత నింపబడినాడా?
- ✦ వ్యక్తికి పరిశుద్దాత్మ అనుభవము ఎలా సంభవించినది?
- ✦ వ్యక్తి జీవితములో పరిశుద్దాత్మ దేవుడు చేసిన క్రియలు ఏమిటి?
- ✦ వ్యక్తి జీవితము మీద పరిశుద్దాత్మ దేవుని ప్రభావము ఎలా ఉన్నది?
- ✦ వ్యక్తిని పరిశుద్దాత్మ దేవుడు ఎలా నడిపించారు?
- ✦ వ్యక్తి ఏమైనా ఆత్మీయవరములు కలిగియున్నాడా?
- ✦ వ్యక్తి తనకు ఇవ్వబడిన ఆత్మీయవరములను ఎలా ఉపయోగించాడు?
- ✦ వ్యక్తి తన జీవితకాలములో చేసిన అద్భుతకార్యములు ఏమిటి?
- ✦ వ్యక్తి దేవుడు తనకు ఇచ్చిన శక్తిని, అవకాశమును దుర్వినియోగము చేసాడా?
- ✦ ఎదురు ప్రశ్నించకుండా దేవుని చిత్తము చెప్పినట్లు చేసే మనస్తత్వము కలిగియున్నాడా?
- ✦ దేవుడు వ్యక్తిని తృణీకరించి నిందకు, అవమానమునకు ఆస్పదముగా చేసియున్నారా?
- ✦ దేవుడు వ్యక్తి జీవితములో చూపిన కృప ఎలాంటిది?
- ✦ దేవుడు వ్యక్తికి తన జీవితములో ఇచ్చిన అవకాశములు ఏమిటి?
- ✦ వ్యక్తి తన జీవితములో దేవుని గురించి తెలుసుకోవటము ఎలా తటస్థించినది?
- ✦ వ్యక్తి యొక్క రక్షణ సాక్ష్యము ఏమిటి?
- ✦ వ్యక్తి దేవుని వాక్యము పట్ల ఎలా ప్రవర్తించేవాడు?
- ✦ వ్యక్తి బ్రతికిన సమయములో అందుబాటులో ఉన్న లేఖనములు ఏమిటి?
- ✦ ఆ లేఖనములలో వ్యక్తికి గల జ్ఞానము ఎలాంటిది?
- ✦ వ్యక్తి ప్రార్ధనా జీవితము ఎలాంటిది?
- ✦ వ్యక్తికి దేవునితో అవినాభావ సంబంధము ఉన్నదా?
- ✦ వ్యక్తి తన సాక్ష్యమును ప్రజల మధ్యన ధైర్యముగా పంచుకోగలిగాడా?
- ✦ వ్యక్తికి దేవుడు ఏమైనా ప్రత్యేక వాగ్దానములు ఇచ్చారా?
- ✦ వ్యక్తి దేవుని చేత ఏ విషయములో అయినా గద్దించబడ్డాడా?
- ✦ వ్యక్తి తన జీవితకాలములో దేవుని మార్గము నుంచి తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయా?
- ✦ వ్యక్తికి దేవుడు అప్పగించిన పనులు అన్నింటిలో నమ్మకత్వము కలిగియున్నాడా?
- ✦ వ్యక్తి తన జీవితకాలములో పాపము మీద విజయము సాదించగలిగాడా? ఆ విజయము ఎలా సాధించాడు?
- ✦ వ్యక్తిలో క్రీస్తునకు సంబంధించిన పోలికలు ఏమైనా ఉన్నాయా?
🔎 వ్యక్తి & ఇతర సంబంధములు
- ✦ ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించేవాడు?
- ✦ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తా? అందరితో కలిసిపోయేవాడా?
- ✦ వ్యక్తిలో ఉన్న నాయకత్వ లక్షణములు ఏమిటి?
- ✦ ఇతరులను ఉపయోగించుకుని మర్చిపోయే వ్యక్తా?
- ✦ ఇతరులకు సహాయము చేసే లక్షణము ఉన్నదా?
- ✦ ఇతరులకు ఎలాంటి గౌరవమర్యాదలు ఇచ్చేవాడు? తనకన్నా పెద్దవారికి? చిన్నవారికి?
- ✦ వ్యక్తి యొక్క భార్య/భర్త ఎవరు? వ్యక్తి జీవితములోనికి భార్య/భర్త ఎలా ప్రవేశించారు?
- ✦ భార్య/భర్త యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నాదా?
- ✦ భార్య/భర్త వలన వ్యక్తి దేవునిలో ఎదిగాడా? పడిపోయాడా?
- ✦ వ్యక్తి యొక్క సంతానము ఎవరు? సంతానము యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నదా?
- ✦ వ్యక్తి యొక్క సమీప స్నేహితులు ఎవరు? స్నేహితుల వలన వ్యక్తి జీవితము ఎలా ప్రభావితము చేయబడినది?
- ✦ వ్యక్తికి శతృవులు ఎవరు? శతృవుల యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఎలా ఉన్నది?
- ✦ వ్యక్తి తన కుటుంబ భాద్యతలు ఎలా నిర్వర్తించేవాడు?
- ✦ వ్యక్తి యొక్క కుటుంబము దేవునిలో ఎదుగుటకు సహాయము చేసారా? కృంగదీశారా?
- ✦ వ్యక్తి తన తల్లిని, తండ్రిని చివరిదశ వరకు సరిగా చూసుకున్నాడా?
- ✦ వ్యక్తి తన తదనంతరం భాద్యతలు చేపట్టుటకు ఎవరిని అయినా తయారుచేశాడా?
- ✦ వ్యక్తి జీవితములో తనని వెంబడించిన శిష్యులు ఉన్నారా?
- ✦ వ్యక్తికి ఎవరైనా గురువు ఉన్నాడా?
- ✦ సంఘమునకు హింస కలిగినపుడు వ్యక్తి ధైర్యము వహించి తన సాక్ష్యము కాపాడుకున్నాడా?
- ✦ సంఘము వెలుపలి వ్యక్తుల పట్ల వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేది?
- ✦ సంఘము యొక్క అభివృద్దిలో/నాశనములో వ్యక్తి యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా?
- ✦ తన దేశము మీద, ప్రక్కన ఉన్న దేశముల మీద వ్యక్తి యొక్క ప్రభావము ఏమిటి?
🔎 వ్యక్తి యొక్క వ్యక్తిత్వము & పాపము
- ✦ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎలాంటిది?
- ✦ వ్యక్తిలో ఉన్న మంచి బలమైన లక్షణములు ఏమిటి? ఆ లక్షణములు అతనికి ఎలా వచ్చాయి?
- ✦ వ్యక్తి జీవితములో ఉన్న చెడ్డ లక్షణములు ఏమిటి? ఆ లక్షణములు అతనికి ఎలా వచ్చాయి?
- ✦ వ్యక్తి తన జీవితములో ఎదిగేకొద్దీ తన ప్రవర్తన సరిచేసుకున్నాడా?
- ✦ వ్యక్తి జీవితములో క్రమేపీ ఎదిగాడా? తగ్గింపబడ్డాడా?
- ✦ వ్యక్తి చేసిన పాపములు ఏమైనా ఉన్నాయా? ఆ పాపములు చేయటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
- ✦ వ్యక్తి తన జీవితములో దేనితో పోరాడాడు? (నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము)
- ✦ వ్యక్తి తన జీవితములో చేసిన పాపము వలన ఎదుర్కొన్న పర్యవసానములు ఏమిటి?
- ✦ వ్యక్తి తన జీవితమునకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యము ఏమిటి?
- ✦ వ్యక్తి జీవితము ద్వారా దేవునికి కలిగిన మహిమ ఏమిటి?
- ✦ వ్యక్తి జీవితము ద్వారా దేవుని నామమునకు ఏమైనా దూషణ కలిగినదా?
- ✦ పెరిగి ఏమయ్యాడో, అలా అవటానికి గల ప్రధాన కారణములు ఏమిటి?
- ✦ వ్యక్తి జీవితము మీద దేవుని సందేశము ఏమిటి? లోకమునకు వేరుగా వ్యక్తి ప్రత్యేకమైన జీవితము జీవించినాడా?
- ✦ దేవుని వాక్యము పట్ల వ్యక్తి యొక్క విశ్వాసము ఎలాంటిది?
- ✦ వ్యక్తి జీవితములో కలిగియున్న ఆశీర్వాదములు ఏమిటి?
- ✦ వ్యక్తి యొక్క జీవితము ముగింపులో దేవుడు అతని గురించి ఎలాంటి తాత్పర్యము ఇచ్చారు?