"ఒక వ్యక్తి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి, ఎలాంటివి కలిగి ఉండకూడదు అని బైబిలు చెప్తుందో తెలుసుకోవటానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది."
వ్యక్తిత్వ లక్షణముల స్టడీ విధానము
-
1
✏️
స్టడీ చెయ్యాలి అనుకున్న లక్షణాన్ని వ్రాసుకొనండి.
-
2
📖
ఒక వ్యక్తి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి, ఎలాంటివి కలిగి ఉండకూడదు అని బైబిలు చెప్తుందో తెలుసుకోవటానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది.
-
3
🎯
ఈ స్టడీ ద్వారా మనలో పెంచుకొనవలసిన, తృంచుకొనవలసిన లక్షణములను తెలిసికొని వాటికొరకు సిద్దపడాలి.
-
4
🌱
ఒకసారికి ఒక లక్షణము మీద పనిచేయండి. అది సాదించిన తరువాత వేరే లక్షణము గురించి స్టడీ చెయ్యండి.
-
5
🙏
ఈ వ్యక్తిత్వ లక్షణములు మీలో పెంపొందేలా పరిశుద్దాత్మ దేవుని సహాయము మీద ఆధారపడండి.
-
6
⚖️
మీరు స్టడీ చేస్తున్న లక్షణమునకు వ్యతిరేకమైన లక్షణమును కూడా వ్రాసుకుని స్టడీ చెయ్యండి.
-
7
📘
ముందుగా మీరు ఎంచుకున్న లక్షణమునకు నిర్వచనము తెలుసుకొనండి. దీని నిమిత్తము డిక్షనరీ ఉపయోగించండి.
-
8
🔍
పరిశుద్ద గ్రంధములో ఈ రెండు లక్షణముల గురించి ఇవ్వబడిన లేఖనములను సేకరించండి. దీని నిమిత్తము పదసూచిక ఉపయోగించండి.
-
9
🔗
ఆ వచనముల యొక్క రిఫరెన్స్ లు కూడా సేకరించండి. దీని నిమిత్తము రిఫరెన్స్ బైబిలు ఉపయోగించండి.
-
10
🕊️
వాటి అన్నింటి మీద కొద్ది సమయము ప్రార్ధనా పూర్వకముగా ధ్యానము చేయండి.
-
11
❓
మీకు ఈ ధ్యానములో సహకరించటానికి ఈ క్రింది ప్రశ్నలు వేసుకొనండి.
❓ ధ్యానமందు వేసుకొనవలసిన ప్రశ్నలు
- › ఈ లక్షణము మంచిది అయితే దానివలన కలిగే లాభములు ఏమిటి?
- › ఈ లక్షణము చెడ్డది అయితే దానివలన కలిగే నష్టములు ఏమిటి?
- › ఈ లక్షణము మంచిది అయితే అది నాలో ఉండటము వలన ఇతరులకు కలిగే ఉపయోగములు ఏమైనా ఉన్నాయా?
- › ఈ లక్షణము చెడ్డది అయితే అది నాలో ఉండటము వలన ఇతరులకు కలిగే నష్టములు ఏమిటి?
- › ఈ లక్షణము మంచిది అయితే దీని గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఏమైనా ఉన్నాయా?
- › ఈ లక్షణము చెడ్డది అయితే దీని గురించి దేవుడు ఇచ్చిన హెచ్చరికలు, శాపములు, తీర్పులు ఏమైనా ఉన్నాయా?
- › ఈ లక్షణము గురించి దేవుని ఆజ్ఞ ఏమైనా ఉన్నదా?
- › ఈ లక్షణము ఒక మనిషిలో రావటానికి ఎలాంటి పరిస్థితులు దోహదము చేస్తాయి?
- › ఈ లక్షణము గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమైనా చెప్పటము, బోధించటము, హెచ్చరించటము జరిగినదా?
- › ఈ లక్షణము గురించి పరిశుద్ద గ్రంధములో ఏ పుస్తకములలో వ్రాయబడినది?
- › ఈ లక్షణము గురించి ఎక్కువగా ప్రస్తావించిన రచయిత ఎవరు?
- › ఈ లక్షణము పరిశుద్ద గ్రంధములో దేనితో అయినా పోల్చి వివరించటము జరిగినదా? అలా అయితే పోల్చబడిన వస్తువు, జీవి ఏమిటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
- › ఈ లక్షణము వేరే ఇతర లక్షణములతో కలిపి చెప్పబడినదా? అయితే ఆ ఇతర లక్షణములు ఏమిటి?
- › దేవుడు ఈ లక్షణము గురించి ఎలాంటి అభిప్రాయము లేదా ఉద్దేశ్యము కలిగి ఉన్నారు అని లేఖనము చెప్తుంది?
- › ఈ లక్షణము కలిగిన వ్యక్తులు పరిశుద్ద గ్రంధములో ఎవరు ఉన్నారు?
- › ఈ లక్షణము వారి జీవితములను ఎలా ప్రభావితము చేసినది?
- › ఈ లక్షణము ద్వారా వారి జీవితముల అంతము/గమ్యము ఎలా మారినది?
🎯 మీరు చేసిన అధ్యయనము బట్టి ఈ క్రింది విషయములు ఆలోచించండి
- ✦ ఈ లక్షణము మీలో ఉండదగినదా? ఉండకూడనిదా?
- ✦ ఈ లక్షణము గురించి మీ హృదయమునకు హత్తుకున్న లేదా ప్రాముఖ్యమైన 1 లేదా 2 వచనములను వ్రాయండి.
- ✦ మీ జీవితములో ఈ యొక్క లక్షణము ఎప్పుడు, ఎలా ప్రతిబింబిస్తున్నదో గమనించండి.
- ✦ ఈ లక్షణము ఉండవలసినది అయితే దానిని పొందుకోవటానికి లేదా అభివృద్ధి చేసుకోవటానికి పరిశుద్దాత్మ దేవుని సహాయముతో మీరు చేయబోతున్న ప్రయత్నములు ఏమిటి?
- ✦ ఈ లక్షణము మీలో ఉండకూడనిది అయితే దానిని వదిలించుకోవటానికి, మరలా రాకుండా ఉండటానికి మీరు పరిశుద్దాత్మ దేవుని సహాయముతో చేయబోవుతున్న ప్రయత్నములు ఏమిటి?
- ✦ మీరు చేయబోవుతున్న ప్రయత్నముల యొక్క ప్రణాళిక ఎలా అమలుచేయబోవుతున్నారు, దానికి సంబందించిన కాలపరిమితి వివరములు వ్రాసుకొనండి.
- ✦ ఈ లక్షణము గురించి ప్రార్ధన చేయవలసిన అంశములు వ్రాసుకొనండి.
- ✦ ఈ లక్షణము మీ కుటుంబములోని ఇతర సభ్యులలోను, తరువాతి తరములలోను రావటానికి లేదా రాకుండా ఉండటానికి మీరు తీసుకోబోతున్న చర్యలు ఏమిటి?
- ✦ ఈ అధ్యయనములో మీరు గ్రహించిన/నేర్చుకున్న విషయములను వ్రాయండి.