"బైబిలులోని ముఖ్యమైన పదముల యొక్క లోతైన అర్థాన్ని, అది బైబిలులో ఎలా ఉపయోగించబడినదో అర్థం చేసుకొనుటకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది."
పదముల వారీగా స్టడీ చేసే విధానము
-
1
🔤
మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న పదము ఎంచుకొనండి.
-
2
📖
ఆ పదమునకు మాతృబాషలోను, ఇంగ్లీషులోను, గ్రీకు/హీబ్రూ బాషలో గల నిర్వచనము తెలుసుకొనండి.
-
3
🔄
ఇంగ్లీషు బాషనందు గల వివిధ తర్జుమాలలో ఆ పదమునకు బదులుగా వేరే ఇతర పదములు ఏమైనా ఉపయోగించారేమో చూడండి. ఒకవేళ ఉపయోగిస్తే అవి ఏమిటి? వాటి అర్ధములు ఏమిటి?
-
4
🌱
ఈ పదము వాడుకలోనికి ఎలా వచ్చినది.
-
5
📋
ఈ పదము బైబిలునందు ఎక్కడ ఉపయోగించబడినదో వచనములు సేకరించండి.
-
6
🔢
ఈ పదము బైబిలునందు మొత్తము ఎన్ని సార్లు ఉపయోగించబడినదో తెలుసుకొనండి.
-
7
📚
ఈ పదము ఎక్కువ ఏ పుస్తకములలో కనిపిస్తుంది?
-
8
✍️
ఏ రచయిత ఈ పదమును ఉపయోగించారు?
-
9
🕐
పుస్తకము వ్రాయబడిన కాలమునకు, ప్రస్తుత కాలమునకు మధ్యన పదము యొక్క వాడుక, అర్ధము ఏమైనా మారినదా?
-
10
🔍
రచయిత తన పుస్తకములో ఈ పదము ఒకే విధముగా ఉపయోగించాడా లేక ఏమైనా మార్పులు చేసాడా?
-
11
📝
ఈ పదము ఉపయోగించబడిన సందర్భములు ఏమిటి?
-
12
🔀
సందర్భమును బట్టి పదము యొక్క అర్ధము ఏమైనా మార్పు చెందినదా?
-
13
🔗
ఈ పదమును వేరే ఇతర పదములతో కలిపి ఉపయోగించటము జరిగినదా? అయితే అవి ఏమిటి?
-
14
⚖️
ఈ పదమును వేరే ఇతర పదములతో పోల్చటము జరిగినదా? అయితే అవి ఏమిటి?
-
15
💡
ఈ పదము అర్ధము అవటానికి రచయితలు ఏవైనా ఉదాహరణ, ఉపమానము, పోలిక ఉపయోగించారా?
-
16
✝️
ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవుడు ఈ పదము గురించి ప్రత్యేకముగా ఏమైనా మాట్లాడారా?
-
17
🙏
ఈ పదము దేవునికి మాత్రమే ఉపయోగించదగినదా?
-
18
🌟
ఈ పదము ద్వారా దేవుని గురించిన జ్ఞానము ఏదైనా మనకు లభిస్తుందా?
-
19
🚫
ఈ పదము దేవుని చేత నిషేదించబడిన జాబితాలో ఉన్నాదా?
-
20
👤
ఈ పదము పరిశుద్ద గ్రంధములో ఎవరైనా వ్యక్తుల జీవితమును ప్రభావితము చేసినదా?
-
21
🗂️
ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానములు అన్నీ సేకరించి వాటిని విశ్లేషించండి.
-
22
📄
ఈ క్రమములో మీరు నేర్చుకున్న విషయములు, అవగాహన వ్రాయండి.
-
23
🔎
ఈ స్టడీ చేసిన తరువాత మీ జీవితములో సరిచేసుకొనవలసిన అంశములు ఏమైనా కనిపించాయా?
-
24
🗓️
వాటి విషయము మీరు చేయవలసినది ప్రణాళిక సిద్దము చేయండి.