"మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న అంశము గురించి వ్రాసుకొని, దాని పరిధి నిర్ణయించి — బైబిలు నుండి సంబంధిత వచనములను సేకరించి స్టడీ చేయుట ఈ పద్ధతి లక్ష్యము."
అంశముల వారీగా స్టడీ చేసే విధానము
-
1
✏️
మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న అంశము గురించి వ్రాసుకొనండి.
-
2
📏
అంశము యొక్క పరిధి నిర్ణయించండి (దిగువన చూపిన పరిధుల నుండి ఒకటి ఎంచుకోండి).
- › ఎవరైనా రచయిత వ్రాసిన పుస్తకములు
- › బైబిలులోని ఒక విభాగము (ధర్మశాస్త్రము, సువార్తలు…)
- › ఏదైనా ఒక పుస్తకము
- › పాత / క్రొత్త నిబంధన
- › మొత్తము బైబిలు
-
3
🌱
ముందుగా చిన్న పరిధి ఎంచుకుని, మీకు అలవాటు అయ్యాక పరిధి పెంచండి.
-
4
❓
ఈ క్రింది ప్రశ్నలు ఆ అంశము గురించి వేసుకొనండి (ఏమిటి? ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఎవరు? ఎక్కడ?).
ఏమిటి? ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఎవరు? ఎక్కడ? -
5
📋
ఈ ప్రశ్నలకు సంబంధించి ఆ అంశము పరిధిలోని వచనములను, సమాధానములను సేకరించండి.
-
6
📝
ప్రతి వచనము స్టడీ చేసి మీరు గ్రహించిన విషయము ఒక చోట వ్రాయండి.
-
7
📄
అన్ని వచనములు అయిన తరువాత సారాంశము మీ స్వంత పదములు ఉపయోగించి వ్రాయండి.
-
8
🔍
మీరు గ్రహించిన విషయములలో మీ జీవితమునకు అన్వయించుకొనదగినవి గుర్తించండి.
-
9
🗓️
వాటిని అన్వయించుకొనుటకు మీ ప్రణాళిక సిద్దము చేయండి.
💡 ఉదాహరణ అంశాలు
- ✦ ఆదికాండములో విధేయత
- ✦ కీర్తనలలో దేవుని స్తుతించిన పద్దతులు
- ✦ రాజుల గ్రంధములో దేవుని వ్యతిరేకించిన వారికి ఏమి సంభవించినది